Thursday, March 4, 2010

గురజాడ దేశభక్తి కవిత

దేశమును ప్రేమించుమన్నా
మంచి అన్నది పెంచుమన్నా
వొట్టి మాటలు కట్టిపెట్టోయ్
గట్టి మేల్ తలపెట్టవోయ్

పాడిపంటలు పొంగిపొరలే
దారిలో నువ్వు పాటుపడవోయ్
తిండి కలిగితే కందకలదోయ్
కంద కలవాడేను మనిషోయ్

ఈసురోమని మనుషులుంటే
దేశమేగతి బాగుపడునోయ్
జల్దుకొని కళలెల్ల నేర్చుకు
దేశి సరుకులు నింపవోయ్

అన్ని దేశాల క్రమ్మవలెనోయ్
దేశి సరుకుల నమ్మవలేన్నోయ్
డబ్బు తేలేనట్టి నరులకు
కీర్తి సంపద లబ్బనోయి

No comments:

Post a Comment