డా||కొత్వాలు అమరేంద్ర ''రేఖామాత్రంగా'' అంటూ తొలి పలుకుల్లోనే అసమగ్రతను అంగీకరించడం బాగానే వుంది కానీ... ప్రముఖుల... నిరంతర సాహిత్య సేవ, సాంస్కృతిక సేవ చేస్తున్న వారిని పేర్కొనకపోవడం విస్మయం కలిగిస్తోంది. ఉదాహరణకు కడపలో బ్రౌన్ గ్రంథాలయ నిర్వహణ, సాహిత్య వ్యాసంగం సాగించే జానమద్ది హనుమశాస్త్రి, ఔత్సాహిక కవుల్ని ప్రోత్సహిస్తూ సీనియర్ పాత్రికేయులుగా వుండి పత్రిక సంపాదకులుగా వ్యవహరిస్తున్న శశ్రీ, ప్రఖ్యాత నాటకకర్త రమణారెడ్డి, తాకట్టులో భారతదేశం గ్రంథకర్త స్వర్గీయ తరిమెల నాగిరెడ్డి, పంచసహస్రావధానం చేసిన మేడసాని మోహన్, నాగఫణిశర్మ లాంటి వారి గురించి రాయకపోవడం విడ్డూరం. ఇలా పేర్కొంటూపోతే పెద్ద లిస్ట్ అవుతుంది.
అలాగే తెలుగు నాటక రంగాన్ని అంతర్జాతీయ వీధుల్లో కవాతు చేసిన బళ్ళారి రాఘవ, నేటి తరంలో సిద్ధప్పనాయుడు.. లాంటి వారి గురించి రాయకపోవడం బాధాకరం. మదనపల్లిలో ఋషివ్యాలీ స్కూల్, జిడ్డు కృష్ణమూర్తి ప్రభావం... లాంటి అంశాలు మరుపుకు తావులేనివి. నాలుగు జిల్లాల్లో 68 మంది సాహితీవేత్తలతో గ్రంథం రాస్తే అది అసమగ్రమే కదా!! రాళ్ళపల్లి, బవిజేపల్లి, మానపల్లి, శంకరంబాడి, కోలాచలం, రాచమల్లు, వావికొలను, గడియారం, సభా, గంగాధరం, కేతు, పుట్టపర్తి, ధర్మవరం, మధురాంతకం, పులికంటి, జయరాం, కేశవరెడ్డి, సింగమనేని, అంతటి, వల్లంపాటి, జి.ఎన్.రెడ్డి, కల్లూరు గార్లపై రాసిన వ్యాసాలు... ప్రశంసనీయంగా వున్నాయి. అలాగే కనీసం జిల్లాలవారీగా (4 జిల్లాల్లో) కవులు, రచయితల పట్టిక ఇస్తే గ్రంథం సమగ్రతకు సరితూగకున్నా... కొంతవరకు... న్యాయం చేసినట్లు అనిపించేది... మలి ముద్రణల్లో సరిచేస్తే పాఠకులకు, పరిశోధకులకు, పండితులకు, పామరులకు ప్రయోజనకారిగా భాసిస్తుంది.
రచన : డా|| కొత్వాలు అమరేంద్ర,
పేజీలు : 190, వెల : 100/-,
ప్రతులకు : విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్,
విజ్ఞాన్‌భవన్ - 4-1-435, బ్యాంక్ స్ట్రీట్,
హైదరాబాద్-500001.
No comments:
Post a Comment